TikTok App | యాప్ స్టోర్స్ నుంచి టిక్‌టాక్‌ను తొలగించాలి.. ఆపిల్, గూగుల్ సంస్థలకు చట్టసభ్యుల విజ్ఞప్తి
TikTok App | ఆపిల్, గూగుల్ సంస్థలకు అమెరికా చట్టసభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు. టిక్‌టాక్‌ను ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తితో సహా ఇద్దరు యూఎస్ చట్టసభ సభ్యులు కోరారు.
TikTok App | ఆపిల్, గూగుల్ సంస్థలకు అమెరికా చట్టసభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు. టిక్‌టాక్‌ను ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తితో సహా ఇద్దరు యూఎస్ చట్టసభ సభ్యులు కోరారు. ఏప్రిల్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకం చేసిన బిల్లు సహా.. బైటెడెన్స్ (Owner Of TikTok) నిషేధాన్ని ఎదుర్కొంటుంది. యూఎస్ చట్టసభ సభ్యులు జాన్ మూలేనార్, రాజా కృష్ణమూర్తి ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లకు లేఖ రాశారు. జనవరి 19లోగా ఆయా యాప్ స్టోర్స్ నుంచి టిక్‌టాక్‌ని తొలగించేందుకు సిద్ధం కావాలని కోరారు. టిక్‌టాక్ సీఈవో షు జీ చౌని వెంటనే పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదించాలని లేఖలో కోరారు.
ఫారిన్ అడ్వైజరీ కంట్రోల్డ్ అప్లికేషన్ యాక్ట్ నుంచి అమెరిక్లను రక్షించే చర్యను డీసీ సర్క్యూట్ కోర్ట్ సమర్థించింది. ఈ క్రమంలో టిక్‌టాక్‌తో పాటు టీమ్ కుక్, సుందర్ పిచాయ్‌లకు చట్టసభ్యులు లేఖలో పంపారు. టిక్‌టాక్‌పై ఇప్పటికే చాలాదేశాలు నిషేధించాయి. టిక్‌టాక్‌ను భారత్ జూన్ 2020లో బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. భద్రతను దృష్టిలో పెట్టుకొని చైనాకు చెందిన 58 యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండోనేషియా, కిర్గిజిస్తాన్, ఆస్ట్రేలియా, రష్యా, యూకే, బెల్జియం, డెన్మార్క్, కెనడా, న్యూజిలాండ్, తైవాన్, మాల్టా, ఫ్రాన్స్, నార్వే, లాట్వియా సైతం టిక్‌టాక్‌పై నిషేధాన్ని విధించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

