ఇస్తాంబుల్: తుర్కియేలోని ఇస్తాంబుల్‌లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు తుపాకీ కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారని, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని తెలిసింది.
దుండగులు కిరాయి వాహనంలో ఇస్తాంబుల్‌కు చేరుకున్నారని, దుండగుల్లో ఒకరికి దోపిడీలకు పాల్పడే ఒక సంస్థతో సంబంధముందని తుర్కియే హోం మంత్రి తెలిపారు.