బీజింగ్: చైనాలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. మరోవైపు కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగి అనే ముద్రను చెరిపేసుకోవడం కోసం యువత దారులు వెతుకుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కొందరు ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
ఉద్యోగులుగా, యజమానులుగా నటించేందుకు ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఈ ఫేక్ ఆఫీస్‌లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అద్దెను రోజుకు రూ.350గా నిర్ణయించారు. బాస్‌గా నటించాలంటే అదనపు సౌకర్యాలతో ఫేక్ ఆఫీస్‌లను రోజుకు సుమారు రూ.580 వరకు వసూలు చేస్తామని చెప్తున్నారు. తమ కుటుంబ సభ్యుల వద్ద తాము నిరుద్యోగులమని చెప్పుకోవడానికి ఇష్టపడని వారికి ఇది మంచి అవకాశమని అంటున్నారు.