టెహ్రాన్, ఏప్రిల్ 16 : అణు బాంబును తయారు చేయడంలో ఇరాన్ ఎంతో దూరంలో లేదని ఐక్య రాజ్య సమితికి చెందిన అణు నిఘా సంస్థ అధిపతి వెల్లడించారు. బుధవారం ఇరాన్ను సందర్శించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధిపతి రఫేల్ గ్రాసీ లే మాండే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ అణ్వస్ర్తాలు తయారుచేసే సామర్థ్యాన్ని ఇరాన్ ఇంకా సాధించనప్పటికీ అది ఎంతో దూరంలో లేదని మాత్రం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అణ్వస్ర్తాల తయారీ ప్రక్రియను ఆయన వివరిస్తూ ఇరాన్ వద్ద ముక్కలు ఉన్నాయని చెప్పారు.