యునైటెడ్ నేషన్స్, జనవరి 10: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా నేత హఫీజ్ సయీద్ పాక్ ప్రభుత్వ కస్టడీలో 78 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన ఆయనకు ఈ శిక్ష పడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
73 ఏళ్ల సయీద్‌ను ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి చెందిన ఆంక్షల కమిటీ 2008 డిసెంబరులో ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. టెర్రర్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఏడు కేసుల్లో దోషిగా తేలిన సయీద్ 2020 ఫిబ్రవరి 12 నుంచి శిక్ష అనుభవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తన వెబ్సైట్లో పేర్కొంది.