2 గంటలపాటు ఏకధాటిగా పేలుళ్లు
- గ్రీస్‌లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం
- ఫ్లైట్‌లో 12 టన్నుల పేలుడు సామగ్రి
ఏథెన్స్, జూలై 17: గ్రీస్ ఉత్తర ప్రాంతంలోని కవలా నగర సమీపంలో ఉక్రెయిన్ విమాన సంస్థ మెరిడియన్ నిర్వహించే ఓ ఆంటోనోవ్ కార్గో విమానం శనివారం రాత్రి కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతంలో 2 గంటల పాటు భారీస్థాయిలో పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో పాటు పెద్దయెత్తున మంటలు రేగాయి. సెర్బియా నుంచి జోర్డాన్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లాల్సిన ఈ విమానంలో ల్యాండ్మైన్లతో సహా దాదాపు 12 టన్నుల మేర ఆయుధ సామగ్రి తరలిస్తున్నారు. ఈ దుర్ఘటనలో పైలట్లతో సహా 8 మంది సిబ్బంది మరణించారు. వీరంతా ఉక్రెయిన్‌కి చెందిన వారని తెలుస్తున్నది. విమానంలోని ఓ ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యే ఈ ప్రమాదానికి కారణమని గ్రీస్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొన్నది. పైలట్ అందించిన సమాచారంతో కవలా ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశామని, అయితే ఆ వెంటనే విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిన తర్వాత ఎయిర్‌పోర్టుకు 40 కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో ఫ్లైట్ కుప్పకూలిందని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

