కీవ్: పుతిన్ నేరుగా చర్చలకు వస్తే అప్పుడు సమస్యలన్నీ టేబుల్‌పై ఉంటాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. క్రిమియా, డాన్బాస్ ప్రాంతాల అంశాల గురించి చర్చించుకోవచ్చు అన్నారు. కానీ చివరి వరకు తాము లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. పుతిన్ నేరుగా చర్చల్లో పాల్గొనాలని జెలెన్స్కీ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఏ ఫార్మాట్లో అయినా పుతిన్‌తో డైరక్ట్‌గా చర్చలు జరిగాలని జెలెన్స్కీ అన్నారు. యుద్ధాన్ని ఆపాలంటే ఓ మార్గం ఉందని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ పుతిన్ చర్చలకు రావాల్సిందే అన్నారు. రష్యా ఆక్రమిత క్రిమియాతో పాటు డాన్బాస్ ప్రాంతం గురించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక ఆరోపణలు చేశారు. రసాయనిక, జీవాయుధ ఆయుధాలు వాడే ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నెల రోజులకు చేరినా.. ఆ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రగతి ఆశించిన రీతిలో లేదు.
🔊Звернення Президента України @ZelenskyyUa за підсумками 26-го дня війни:
💬«Це був день важких подій. Важких висновків. Але це був іще один день, який наближає нас до нашої перемоги. До миру для нашої держави».
Повне відеозвернення за посиланням ➡️ https://t.co/RN9Ms7YKTK pic.twitter.com/BJIX0ZphpS
— Defence of Ukraine (@DefenceU) March 22, 2022
ఉక్రెయిన్ దళాలు.. రష్యా సేనల్ని సమర్ధంగా అడ్డుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. సమర్థవంతంగా తిప్పికొట్టడం వల్లే రష్యా దళాలు నెమ్మదించినట్లు ఆయన తెలిపారు. ఖార్కివ్ ప్రాంతంలో ఓ రష్యా విమానాన్ని కూల్చివేసినట్లు జెలెన్స్కీ చెప్పారు.