గాయపడిన సైనికుడిని డ్రోన్‌తో తరలింపు
గాయపడిన సైనికుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా డ్రోన్‌ను ఉపయోగించారు. ఉక్రెయిన్ జవాన్ కొస్టియన్టిన్ వ్లాసెంకో 491 రోజులుగా సరిహద్దులోని ఫ్రంట్ లైన్లో చిక్కుకుపోయాడు. అతడి చుట్టూ రష్యా బలగాల ముప్పు పొంచి ఉంది. భూమి లోపల మందుపాతరలు ఉండటం, గగనతలంలో డ్రోన్లు చక్కర్లు కొడుతుండటంతో అతడు సులభంగా తప్పించుకోలేపోయాడు. సహాయ బృందాలు అతడిని చేరుకోలేకపోయాయి.
- ప్రపంచంలోనే తొలిసారిగా ఉక్రెయిన్‌లో
కీవ్: గాయపడిన సైనికుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా డ్రోన్‌ను ఉపయోగించారు. ఉక్రెయిన్ జవాన్ కొస్టియన్టిన్ వ్లాసెంకో 491 రోజులుగా సరిహద్దులోని ఫ్రంట్ లైన్లో చిక్కుకుపోయాడు. అతడి చుట్టూ రష్యా బలగాల ముప్పు పొంచి ఉంది. భూమి లోపల మందుపాతరలు ఉండటం, గగనతలంలో డ్రోన్లు చక్కర్లు కొడుతుండటంతో అతడు సులభంగా తప్పించుకోలేపోయాడు. సహాయ బృందాలు అతడిని చేరుకోలేకపోయాయి.
ఈ పరిస్థితుల్లో అతడిని రక్షించడానికి ఒక డ్రోన్‌ను ఉపయోగించారు. గర్జఫ్ డిఫెన్స్ ఉచితంగా వాడుకొమ్మని ఇచ్చిన డ్రోన్‌కు ఉన్న ప్రత్యేక బెల్ట్ సాయంతో అతడిని రక్షించారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో గాయపడిన సైనికుడు డ్రోన్ ఆపరేటర్‌తో మాట్లాడుతూ అతడి సూచనలను పాటించాడు. రష్యాతో నాలుగేండ్లుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏటా 10 లక్షల చవకైన డ్రోన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఉక్రెయిన్ పెంచుకొన్నది. మరోవైపు ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తున్నది. యుద్ధం ముగించేందుకు ఒక ఒప్పందానికి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ను కోరారు. రష్యా డ్రోన్, క్షిపణి దాడులను ఎదుర్కోవడానికి అమెరికా నుంచి ఉక్రెయిన్ సైనిక సాయం కోరుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

