Ukraine-Russia War | కీవ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రరూం దాల్చింది. ఆదివారం రాత్రి నుంచి రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. ఈ దాడుల్లో కనీసం నలుగురు చనిపోయారని, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. రాజధాని కీవ్‌పై రష్యా 100కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో పౌరులు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక్కడి మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు.
రష్యా క్షిపణులు, డ్రోన్లను కూల్చేందుకు యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు సహా కీలక మౌలిక వసతులను రష్యా టార్గెట్ చేసిందన్నారు. దీంతో వివిధ నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. మరోవైపు, 9/11 దాడులను గుర్తుతెచ్చేలా రష్యాలోని సరటోవ్లో 38 అంతస్థుల భవనంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా దాడి చేసిన విషయం తెలిసిందే.