కీవ్: రష్యాపైకి ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 125 డ్రోన్లను రష్యా కూల్చేసింది. నైరుతి ప్రాంతమైన వోల్గోగ్రాడ్పై ఉక్రెయిన్ ప్రయోగించిన 67 డ్రోన్లను రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ కూల్చేసినట్లు చెప్పింది.
వొరొనెజ్ ప్రాంతంలో 17 డ్రోన్లను, రొస్టొవ్ రీజియన్లో 18 డ్రోన్లను కూల్చేసినట్లు తెలిపింది. ఇదిలావుండగా, ఉక్రెయిన్ నగరం జపొరిజ్జియాపై శనివారం రాత్రి జరిగిన దాడిలో 14 మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. ఈ దాడుల వల్ల ఈ నగరంలో రవాణా వ్యవస్థ దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.