Ukraine | కీవ్, జూలై 6: ఉక్రెయిన్లోని విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి రష్యా భీకర దాడులకు పాల్పడింది. డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో రష్యా సరిహద్దున ఉన్న ఉక్రెయిన్లోని సుమీ రీజియన్లో అంధకారం అలుముకుంది.
దాదాపు లక్షకు పైగా ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. కాగా, డొనెట్స్క్ ప్రాంతంపై రష్యా ైగ్లెడ్ బాంబులు, రాకెట్లతో జరిపిన దాడుల్లో 11 మంది సాధారణ పౌరులు మరణించగా మరో 43 మంది గాయపడ్డారు.