ఉక్రెయిన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరిగిన విషయాన్ని హైలైట్ చేసిన ఉక్రెయిన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ కోరారు. ఇలాంటి దాడుల వల్ల జరిగే ప్రమాదాలను ఎత్తిచూపిన ఆయన..
‘‘రష్యా చర్యల వల్ల ఏదైనా పెనుప్రమాదం సంభవిస్తే.. ఇప్పుడు నోరు మెదపని వాళ్లు కూడా దాని పర్యవసానాన్ని అనుభవించకపతప్పదు’’ అని హెచ్చరికలు చేశారు. అయితే జాపోరిజియా సమీపంలో జరిగిన దాడులు ఉక్రెయిన్ చేసినవేనని రష్యా అంటుంటే.. కాదు రష్యావే అని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతానికి ఈ దాడులు ఎవరు చేసింది స్పష్టత లేదు.