UK PM : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి (Conservative Party) ఓటమి ఖరారైంది. కీర్ స్టార్మర్ (Keir Starmer) నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం ఖరారైంది. ఎన్నికల ఫలితాలపై భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ స్పందించారు. సార్వత్రిక సమరంలో ఓటమిని అంగీకరించారు. ఇక లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. లేబర్ పార్టీ ఘనవిజయంతో లండన్‌లో శుక్రవారం జరిగిన విజయోత్సవ ర్యాలీలో స్టార్మర్ ప్రసంగించారు.
బ్రిటన్‌లో ఇప్పుడు మార్పు మొదైలందని వ్యాఖ్యానించారు. దేశ పునర్నిర్మాణ దిశగా సాగుతామని చెప్పారు. ప్రజా సేవకు రాజకీయాలను నెరపుతామని అన్నారు. మంచి కోసం రాజకీయాలను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ తరహా ప్రజా తీర్పు తమపై గొప్ప బాధ్యతను మోపిందని అన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరేందుకు స్టార్మర్ మరికాసేపట్లో కింగ్ ఛార్లెస్ IIIని కలవనున్నారు.
బ్రిటన్ ప్రజలు విజ్ఞతతో కూడిన తీర్పును వెలువరించారని స్టార్మర్ అన్నారు. కన్జర్వేటివవ్ పార్టీని మట్టికరిపించే బాధ్యతను నిర్వర్తించారని చెప్పారు. ఇప్పటివరకూ ప్రకటించిన నియోజకవర్గాల ఫలితాల్లో లేబర్ పార్టీ 412 స్ధానాల్లో గెలుపొందగా, కన్జర్వేటివ్ పార్టీ 120 స్ధానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటర్లు 365 స్ధానాల్లో విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో లిబరల్ డెమోక్రాట్లు71 స్ధానాలను స్కాటిష్ నేషనల్ పార్టీ 9 స్ధానాలను గెలుచుకున్నాయి. రిఫాం యూకే 4 నియోజకవర్గాల్లో గెలుపొందింది.
Read More :
Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2కు లెంగ్తీ రన్ టైం.. మరి శంకర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?