బ్రిటన్ హార్డ్లైన్ ఇంటీరియర్ మినిస్టర్ సుయెల్లా బ్రేవ్మాన్ రాజీనామా చేశారు. ఆమె కొత్త ప్రధాని లిజ్ ట్రస్ ప్రభుత్వం నుంచి వైదొలగినట్లు సమాచారం. ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్ ప్రభుత్వం పన్నులు తగ్గించే విషయంలో బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. ట్రస్ నిర్ణయాలన్నీ ఒక్కొక్కటిగా విఫలం అవుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తను ఈ ఊబిలో చిక్కుకోకూడదనే భావనతోనే బ్రేవ్మాన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామా విషయాన్ని తెలుపుతూ ప్రధానికి రాసిన లేఖను ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్రేవ్మాన్ ఇలా తప్పుకోవడం కొత్త ప్రభుత్వానికి గట్టి దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు.