లండన్ : బ్రిటన్లో బాలల లైంగిక దోపిడీ ముఠాల ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ముఠాలపై బ్రిటిష్ ఎంపీ రూపర్డ్ లోవ్ పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేరస్తులు అధికంగా పాక్ సంతతి టాక్సీ డ్రైవర్లు, మార్కెట్ వ్యాపారులు అని ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడైంది. లోవ్ పేర్కొన్న బాధితుల కథనాలు అత్యంత దారుణగా ఉన్నాయి.
ఒక బాధితురాలు మాట్లాడుతూ గత మూడేండ్లలో తాను సుమారు 600 నుంచి 700 మంది పురుషుల చేతిలో అత్యాచారానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు బాధితుల తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, తమను కుక్కల బోనుల్లో బంధించారని, మూగజీవాలతో వేధించారని, ఆ సమయంలో అక్కడున్న వారు నవ్వుతూ వీడియోలు తీసేవారని తెలిపారు.