యూఏఈ అణు విద్యుత్తు కేంద్రంపై డ్రోన్ దాడి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన వేళ యూఏఈలోని బరకహ్ అణు విద్యుత్తు కేంద్రంపై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ప్లాంట్‌లోని విద్యుత్తు జనరేటర్ వద్ద ఈ దాడి జరగడంతో మంటలు చెలరేగాయని అబు దాబి మీడియా ఆఫీస్ వెల్లడించింది.
- చెలరేగిన మంటలు.. రేడియేషన్ లీక్ కాలేదన్న అధికారులు
అబు దాబి : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన వేళ యూఏఈలోని బరకహ్ అణు విద్యుత్తు కేంద్రంపై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ప్లాంట్‌లోని విద్యుత్తు జనరేటర్ వద్ద ఈ దాడి జరగడంతో మంటలు చెలరేగాయని అబు దాబి మీడియా ఆఫీస్ వెల్లడించింది. రేడియేషన్ ప్రభావం చూపే స్థితిలో వెలువడలేదని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఆ ప్లాంట్ కీలక విభాగాలు సాధారణంగానే పని చేస్తున్నాయని వెల్లడించారు. ఈ దాడి చేసిందెవరో ఇంకా తెలియలేదు. ఈ దాడిపై అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. హొర్ముజ్ జల సంధి మార్గంపై ఆధారపడకుండా ముడి చమురును ఎగుమతి చేసే కొత్త పైప్‌లైన్ ప్రాజెక్ట్ పనులను యూఏఈ వేగవంతం చేసిన వేళ ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సౌదీ సరిహద్దుల్లోని పశ్చిమ ఎడారి మారుమూల ప్రాంతంలో ఈ విద్యుత్తు కేంద్రం ఉన్నది. అరేబియా ద్వీప కల్పంలో ఇదే ఏకైక అణు విద్యుత్తు కేంద్రం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

