Aircraft crash | జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం.. ఒకరి దుర్మరణం, ఐదుగురి గల్లంతు..!
Aircraft crash | అమెరికా దేశానికి చెందిన ఓ సైనిక విమానం (Osprey Aircraft) జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు.
టోక్యో: అమెరికా దేశానికి చెందిన ఓ సైనిక విమానం (Osprey Aircraft) జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మిగతా ఐదుగురికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా, ప్రమాదం సంగతిని జపాన్ కోస్ట్ గార్డ్ ధ్రువీకరించింది. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో సముద్రంలో ఓ విమానం కుప్పకూలినట్లు యకుషిమాకు చెందిన మత్స్యకారులు గుర్తించారు. వెంటనే వారు స్థానిక కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన కోస్ట్ గార్డ్ రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. కాగా, విమానం ఎడమ ఇంజిన్ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని స్థానికులు మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా సాయుధ బలగాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ప్రమాదానికి గురైన ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేకమైన విమానం. ఇది హెలికాప్టర్‌గా, విమానంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో కూడా ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయి నలుగురు చనిపోయారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 12 విమానాలు కూలిపోయాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

