బార్సిలోనా: టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో ప్రధానంగా యువకుల్లో క్యాన్సర్ ముప్పు అధికంగా పొంచి ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది. అడ్వాన్స్డ్ దశలో వారిలో క్యాన్సర్ నిర్ధారణ అవుతున్నదని ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకురాలు అన్నా జన్సనా పేర్కొన్నారు. ఈ మేరకు 13వ యూరోపియన్ బ్రెస్ట్ క్యాన్సర్ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. రొమ్ము, పేగు వంటి క్యాన్సర్లకు చాలా దేశాల్లో నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, అయితే ఊపిరితిత్తులు, అండాశయం, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లకు నేషనల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు లేవని, అదేవిధంగా టైప్-2 డయాబెటిస్ రోగుల్లో ఈ రకాల క్యాన్సర్లు అసలు కణితి నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం ప్రారంభమైన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతున్నదని పేర్కొన్నారు.