కాలిఫోర్నియా: రెండేళ్ల చిన్నారి తన తల్లి మొబైల్ ఫోన్ నుంచి 31 చీజ్ బర్గర్లకు ఆర్డర్ చేశాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది. తల్లి కెల్సే బుర్కల్టర్ గోల్డెన్ ఫోన్‌తో ఆడుతున్న చిన్నారి బారెట్.. తెలియకుండానే మెక్‌డోనాల్డ్స్‌కు 31 బర్గర్ల ఆర్డర్ ఇచ్చేశాడు. డోర్‌డాష్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది. ఆర్డర్ తయారు చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని మెసేజ్ రావడంతో తల్లి షాకైంది. తాను కంప్యూటర్ పనిలో నిమగ్నమైన సమయంలో తన పిల్లోడు తెలియకుండానే బర్గర్లు ఆర్డర్ చేసినట్లు ఆమె చెప్పింది. ఈ మొత్తం బర్గర్లకు 62 డాలర్ల బిల్లు అయ్యింది. అయితే ఈ ఆర్డర్‌తో పాటు 16 డాలర్ల టిప్ కూడా ఆ చిన్నారి సమర్పించినట్లు తల్లి పేర్కొన్నది. 31 బర్గర్లను ఏం చేయాలో తెలియక ఆ తల్లి వాటిని కొందరికి డొనేట్ చేసింది. రెండేళ్ల చిన్నారి మరోసారి డోర్‌డాష్ యాప్‌ను వాడకుండా ఉండేందుకు దాన్ని హైడ్ చేయనున్నట్లు ఆమె తెలిపింది. ఇంట్లో పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.