Nobel Prize | కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కాటలిన్ కరికో (హంగేరి), డ్రూ వెయిస్‌మన్‌లకు (అమెరికా) ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది.
- కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్కుప్రతిష్ఠాత్మక పురస్కారం
- ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా టీకాల అభివృద్ధిలో వీరి పరిశోధనలే కీలకం
Nobel Prize | స్టాక్‌హోమ్, అక్టోబర్ 2: కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కాటలిన్ కరికో (హంగేరి), డ్రూ వెయిస్‌మన్‌లకు (అమెరికా) ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. నోబెల్ అసెంబ్లీ సెక్రెటరీ థామస్ పెర్ల్‌మాన్ సోమవారం ఈ పురస్కారాలను ప్రకటించారు. కొవిడ్ రూపంలో మానవాళికి పెను ముప్పు తలెత్తిన తరుణంలో వేగవంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో వీరి పరిశోధనలే కీలకంగా మారాయని నోబెల్ ప్యానల్ కొనియాడింది. గత ఏడాది స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు వైద్య నోబెల్ లభించింది.
2005లో పరిశోధనలు.. ఇప్పుడు గుర్తింపు
హంగేరికి చెందిన కాటలిన్, అమెరికా జాతీయుడైన డ్రూ వెయిస్‌మన్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలు చేశారు. 1990ల్లోనే ఈ తరహా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాలనే ఆలోచన పరిశోధకులకు వచ్చింది. అయితే పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సహోద్యోగులైన కాటలిన్, డ్రూ 2005లో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. అయితే అప్పట్లో వారి కృషిని ఎవరూ గుర్తించలేదు. కానీ కరోనా మహమ్మారితో పోరాటంలో వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడంలో వీరి పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి డాటాను ఉపయోగించి ఫైజర్, బయోటెక్, మోడెర్నా కంపెనీలు కొవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి.
నగదు బహుమతి పెంపు…
డిసెంబర్ 10న కాటలిన్, డ్రూకు నోబెల్ పురస్కారంతో పాటు బంగారు పతకం, నగదు బహుమతి అందజేస్తారు. ఈ వారం మొత్తం వరుసగా వివిధ రంగాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించనున్నారు. ఫిజిక్స్ (మంగళవారం), కెమిస్ట్రీ (బుధవారం), సాహిత్యం (గురువారం), శాంతి పురస్కారం (శుక్రవారం), అర్థశాస్త్రం (అక్టోబర్ 9న) పురస్కారాలను ప్రకటించనున్నట్టు నోబెల్ కమిటీ తెలిపింది. మరోవైపు నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని కూడా పెంచారు. తాజాగా పురస్కారం అందుకునే వారికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు (ఒక మిలియన్ యూఎస్ డాలర్లు) అందించనున్నారు. కాగా, శాంతి పురస్కారాన్ని ఓస్లోలో, మిగతా రంగాల వారికి స్టాక్‌హోమ్‌లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అసలేంటీ ఎంఆర్ఎన్ఏ?
బలహీనమైన వైరస్ లేదా అచేతనమైన వైరస్‌లను ఉపయోగించి సాధారణ వ్యాక్సిన్లను తయారు చేస్తారు. అయితే ఇవి కొన్ని ఇన్ఫెక్షన్లపై సమర్థంగా పని చేయవు. అందుకే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిపై కాటలిన్, డ్రూ దృష్టి సారించారు. ఎంఆర్ఎన్ఏ లేదా మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది జన్యు అణువు. కణాల్లో ప్రొటీన్ సంశ్లేషణలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. కణాల న్యూక్లియస్‌లోని డీఎన్ఏ, రైబోసోమ్‌ల మధ్య ఇవి మధ్యవర్తిగా పని చేస్తాయి. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు జన్యు ప్రొటీన్లను అందిస్తాయి. ఏ ప్రొటీన్ శరీరానికి అవసరమో కణాలకు చెబుతాయి. మన రోగ నిరోధక వ్యవస్థతో ఇంటరాక్ట్ అయి వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా చేస్తాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పని చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

