ఇరాక్ గ్రీన్‌జోన్‌పై రాకెట్ దాడి.. రెండు విమానాలు ధ్వంసం
Two rockets strike inside Baghdad's fortified Green Zone |

బాగ్దాద్ : అమెరికా రాయబార కార్యాలయం ఉన్న బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఇరాక్ సైన్యం ఆదివారం తెలిపింది. రాయబార కార్యాలయం వద్ద ఉన్న రక్షణ వ్యవస్థ ఒక రాకెట్‌ను ధ్వంసం చేసిందని, మరో రాకెట్ జాతీయ స్మారక చిహ్నం సమీపంలో పడగా రెండు విమానాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై ఇరాక్ భద్రతా దళాలు దర్యాప్తును ప్రారంభించాయి.
గ్రీన్జోన్లో అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ఇతర విదేశీ దౌత్య కార్యాలయాలు, ఇరాక్ ప్రభుత్వ భవనాలున్నాయి. ఇటీవల ఈ జోన్‌పై తరుచూ డ్రోన్, రాకెట్ దాడులు చోటు చేసుకుంటున్నాయి. రాకెట్ దాడిని ఇరాన్ మద్దతుగా ఇరాకీ మిలీషియా గ్రూపుల పనేనని అమెరికా మండిపడింది. ఇరాన్ జనరల్ ఖాసేమ్ సులేమానీ, ఇరాకీ మిలీషియా కమాండర్ అబు మహ్దీ అల్ ముహందిస్లను గతేడాది అమెరికా డ్రోన్ దాడి చేసి హతమార్చగా.. ఇరాన్ అలైన్డ్ గ్రూపులు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

