రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, ఈ ప్రభావం ఇతర దేశాలమీద తీవ్రంగా పడుతోంది. చాలా దేశాల్లో వంటనూనె కొరత ఏర్పడుతోంది. ఇండోనేషియాలో వంటనూనె కొనేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
ఈ విషాధ ఘటన ఇండోనేషియాలో క్రూడ్ పామాయిల్ (CPO), తాజా పామాయిల్ ఫ్రూట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటిగా ఉన్న బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమంటన్లో జరగడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో పాక్షికంగా వంటనూనె స్టాక్‌లు తగ్గిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు డిమాండ్ పెరగడంతో స్థానిక ఎగుమతిదారులు ఎగుమతులను పెంచారు.
అలాగే, చాలామంది బయోడీజిల్ తయారీకి ఆయిల్‌ను సప్లై చేస్తున్నారు. దీంతో దేశంలో ఆయిల్ నిల్వలు పడిపోయాయి. మంచి నూనెకోసం జనాలు దుకాణాల ఎదుట భారీగా క్యూ కడుతున్నారు.