వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెలీ ఎంబసీకి చెందిన ఇద్దరు సిబ్బందిని జ్యూయిష్ మ్యూజియం వద్ద షికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగ్స్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా పాలస్తీనాకు విముక్తి కల్పించాలి అంటూ ఆ వ్యక్తి నినాదాలు చేశాడు.
ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. మృతులను రిసెర్చ్ సహాయకుడు యరోన్ లిషింన్స్కీ, విదేశీ పర్యటనలను నిర్వహించే సరాహ్ మిల్గ్రిమ్గా గుర్తించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడాన్ సార్ తెలిపారు.