Turkiye : పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో నరమేథానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సోమవారం పేర్కొన్నారు. పాలస్తీనా పౌరులు లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో యుద్ధోన్మాదంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించి ఈ నెల 7వ తేదీ నాటికి ఏడాది మార్క్‌ను చేరుకున్న సంగతి తెలిసిందే.
ఏడాదిగా కొనసాగిస్తున్న, ఇప్పటికే కొనసాగుతున్న ఈ మారణహోమానికి ఇజ్రాయెల్ త్వరలో లేదా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మర్చిపోకూడదు అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని హిట్లర్‌తో పోల్చడంతోపాటు ఆయనను ‘గాజా కసాయి’ అని కూడా పేర్కొన్నారు.