Plane Crash : గగనతలంలో మరో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టర్కీకి చెందిన సైనిక విమానం(Millitary Cargo Plane) ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఆర్మీకి సంబంధించిన కార్గో విమానం మంగళవారం జార్జియా(Georgia)లో కుప్పకూలింది. అజెర్బైజాన్ (Azerbaijan) నుంచి టర్కీకి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 20 మంది ఉన్నారని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ప్రమాదం కారణంగా వీరంతా మరణించే ఉంటారని సమాచారం.
మా దేశానికి సంబంధించిన C-130 మిలిటరీ కార్గో విమానం అజర్బైజాన్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. అయితే.. అనుకోకుండా ప్రమాదానికి గురైన ఆ విమానం జార్జియా – అజెర్బైజాన్ సరిహద్దులో కూలిపోయింది. ఆ విమానంలో పైలట్, సిబ్బంది, ప్రయాణికులు.. మొత్తంగా 20 మంది ఉన్నారు అని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమాన ప్రమాదం గురించి తెలియగానే టర్కీ రక్షణ దళం సహాయక చర్యలకు రంగంలోకి దిగింది. సిబ్బంది, ప్రయాణికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
🔴 🇹🇷 Plane Crash
11 November 2025 – 10:50 UTC
Lockheed C-130E Hercules
Owner/operator: Türk Hava Kuvvetleri ( Turkish Air Force )
Registration: 68-1609
MSN: 4015FDamage: Destroyed
Location: near the Azerbaijan-Georgia border – Azerbaijan
Phase: En route
Nature: Military… pic.twitter.com/OyQYt7HLxw— PLANES OF LEGEND ✈️ (@PlanesOfLegend) November 11, 2025
అయితే.. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది రక్షణ శాఖ. ఈ ప్రమాదం గురించి జార్జియా అధికారులతో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdogan) మాట్లాడుతున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్లకు ఎర్డోగాన్ సంతాపం తెలిపారు అని స్టేట్ న్యూస్ ఏజెన్స్ అనడోలు(Anadolu) పేర్కొంది. ఈ ప్రమాదంలో టర్కీ దేశస్థులు మరణించడంతో అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇహాం అలియెవ్ సంతాపం తెలిపారు.
🇹🇷| Turkish military cargo plane C130 crashed near the Georgian-Azerbaijan border. pic.twitter.com/iWV8UYHm5L
— Eternal Glory (@EternalGlory0) November 11, 2025
టర్కీ సైనిక విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో అజెర్బైజాన్ మీడియాకు దొరికింది. గంజా విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం ప్రమాదానికి ముందు ఆకాశంలోనే అడ్డంగా పలుమార్లు తిరిగింది. కాసేపటికే దట్టమైన పొగతో కింద పడిపోయినట్టుగా వీడియోలో రికార్డైంది. కింద పడిపోతున్న విమానాన్ని పొలాల్లో ఉన్న స్థానికులు చూశారని మీడియా చెబుతోంది. కూలిపోయిన C-130 మిలిటరీ కార్గో విమానాన్ని అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ తయారు చేసింది.