మంగళవారం 31 మార్చి 2020
International - Mar 17, 2020 , 01:25:44

మాకే దక్కాలి

మాకే దక్కాలి
  • కరోనా వ్యాక్సిన్‌ కోసం ట్రంప్‌ కుట్ర?

బెర్లిన్‌/వాషింగ్టన్‌: కరోనా నుంచి కాపాడే వ్యాక్సిన్‌ను దక్కించుకుని దాని బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాననే పేరుకోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నించారా? ఇది నిజమేనని పేర్కొంటూ జర్మనీ పత్రిక ‘వెల్ట్‌ ఆమ్‌ సోన్‌టాగ్‌' అనే పత్రిక ఇటీవల ప్రచురించిన ఓ వార్తా కథనం కలకలం రేపింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న ‘క్యూర్‌వాక్‌' అనే జర్మనీ సంస్థకు పెద్దమొత్తంలో చెల్లిస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చారన్నది. ఈ సంగతి తెలుసుకున్న జర్మనీ సర్కార్‌ ‘క్యూర్‌వ్యాక్‌'కి అమెరికా కంటే గొప్ప ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో జర్మనీపై అమెరికా ఎదురుదాడికి దిగింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న పలు సంస్థలతో చర్చిస్తున్నామని, కొన్ని కంపెనీల్లో తమ మదుపర్లు పెట్టుబడులూ పెట్టారని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ దొరికితే ఆ ఫార్ములాను ప్రపంచ దేశాలకు ఇస్తామన్నారు. కాగా, తమకు ఎవరూ ఆఫర్‌ ఇవ్వలేదని ‘క్యూర్‌వ్యాక్‌' పేర్కొంది. logo
>>>>>>