సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 09:11:26

మాస్క్ ధ‌రించ‌డమంటే.. దేశ‌భ‌క్తిని చాట‌డ‌మే: ట‌్రంప్

మాస్క్ ధ‌రించ‌డమంటే.. దేశ‌భ‌క్తిని చాట‌డ‌మే: ట‌్రంప్

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో భాగంగా మాస్క్‌ను ధ‌రించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తొలుత ఈ నియ‌మాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్య‌తిరేకించారు.  తాను మాస్క్ ధ‌రించ‌బోన‌న్నారు.  ఆ త‌ర్వాత కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో ట్రంప్ కూడా మాస్క్‌ను ధ‌రించారు. ఇక ఇప్పుడు ఓ ట్వీట్ కూడా చేశారు.  క‌నిపించ‌ని చైనా వైర‌స్‌ను ఓడించేందుకు మ‌నం అంద‌రం ఐక్యంగా పోరాడాల‌న్నారు.  సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌డం వీలుకాని స‌మ‌యంలో.. ముఖానికి మాస్క్ ధ‌రించ‌డం దేశ‌భ‌క్తిని చాటడ‌‌మే అని కొంద‌రంటున్నార‌ని ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.  మాస్క్ పెట్టుకుని దిగిన ఓ ఫోటోను త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు.  నా క‌న్నా గొప్ప దేశ‌భ‌క్తుడు ఎవ‌రూ ఉండ‌ర‌ని, నేను మీ ఫెవ‌రేట్ అధ్య‌క్షుడిన‌ని ట్రంప్ ఆ ట్వీట్‌లో తెలిపారు. 
logo