వాషింగ్టన్: నైలు నది జలాల పంపిణీపై ఈజిప్ట్-ఇథియోపియాల మధ్య నెలకొన్న వివాదంలో మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాకు ఈ నెల 16న లేఖ రాశారు. ఆ లేఖను ట్రూత్ సోషల్‌లో పంచుకున్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం నదీ జలాల వివాదానికి బాధ్యతాయుతమైన, శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని ఫత్తాకు ట్రంప్ హామీ ఇచ్చారు. నైలు నదిపై ఇథియోపియో నిర్మించిన ఇథియోపియన్ పునరుజ్జీవ ఆనకట్టను గత సెప్టెంబర్‌లో ప్రారంభించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. నైలు నది ఈజిప్ట్‌కు ప్రాణాధారమైన వనరు.