న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త వ్యాపారంలో ప్రవేశించారు. సరికొత్త 5జీ వైర్లెస్ సర్వీస్‌తోపాటు 499 డాలర్లకు లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించడం ద్వారా మొబైల్ ఫోన్ల మార్కెట్లో అడుగు పెట్టారు. ‘ట్రంప్ మొబైల్’ అని పిలిచే ఈ వెంచర్‌ను న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో సోమవారం అధికారికంగా ప్రకటించారు.
త్వరలో ‘టీ1’ పేరిట నాజూకైన (స్లీక్), గోల్డ్ స్టాండర్డ్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అమెరికాలో అతిపెద్ద టెలికం సంస్థలైన వెరిజోన్, ఏటీఅండ్‌టీ, టీ-మొబైల్ నెట్‌వర్క్‌లలో లభ్యమయ్యే ట్రంప్ అన్లిమిటెడ్ 5జీ వైర్లెస్ సర్వీసును పొందాలంటే నెలకు 47.45 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.