క్యాపిటల్ విచారణను తప్పుపట్టిన ట్రంప్
వాషింగ్టన్: క్యాపిటల్ హిల్ దాడి ఘటనపై అమెరికా ప్రజాప్రతినిధుల కమిటీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే విచారణ చేపడుతున్న ఆ బృందంపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. అది కంగారో కోర్టు అని ఆయన ఆరోపించారు. అక్రమ రీతిలో ఆ విచారణ జరుగుతున్నట్లు ఆయన విమర్శించారు. దీనిపై ట్రంప్ 12 పేజీల ప్రకటన రిలీజ్ చేశారు. డెమోక్రటిక్ ప్రభుత్వ విపత్తుల నుంచి అమెరికన్లను తప్పుదోవ పట్టించేందుకు ఈ విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ అధికారంలో కొనసాగేందుకు తిరుగుబాటుకు ప్రయత్నించినట్లు కమిటీన తన విచారణలో అభిప్రాయపడింది. సోమవారం రెండవ సారి ఆ ప్యానెల్ విచారణ చేపట్టింది. 2021 జనవరి ఆరవ తేదీన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై దాడి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడుని బేస్మెంట్ బైడెన్ అంటూ ట్రంప్ ఆరోపించారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన పోటీని అడ్డునేందుకే ఈ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు ట్రంప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

