Mufti Qaiser Farooq | ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి అనుచరుడు ఫరూఖ్ కాల్పుల్లో మృతి
Mufti Qaiser Farooq | ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు కాల్పుల్లో మరణించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మోస్ట్ వాంటెడ్ లీడర్లలో ఒకడైన 30 ఏళ్ల ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ (Mufti Qaiser Farooq) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ సంఘటన జరిగింది.
ఇస్లామాబాద్: 26/11 ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు కాల్పుల్లో మరణించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మోస్ట్ వాంటెడ్ లీడర్లలో ఒకడైన 30 ఏళ్ల ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ (Mufti Qaiser Farooq) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ సంఘటన జరిగింది. శనివారం సమనాబాద్ ప్రాంతంలోని ఒక మతపరమైన సంస్థ సమీపంలో అతడ్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ మీడియా, ఆ దేశ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఫరూఖ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడించాయి. ఈ కాల్పుల్లో పదేళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు.
కాగా, హఫీజ్ సయీద్ కుమారుడు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత ఖైజర్ ఫరూఖ్ కాల్పుల్లో మరణించడం కలకలం రేపింది. ఫరూఖ్‌పై కాల్పుల సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The "unknown men" in action pic.twitter.com/924EdYVPRw
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 30, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

