న్యూయార్క్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రికత్త పెరిగింది. ఆ రెండు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్‌లోని పలు టార్గెట్లపై జూన్ 10వ తేదీన అమెరికా దాడులు చేసినట్లు సెంట్రల్ కమాండ్(U.S. Central Command) చెప్పింది. అమెరికా మిలిటరీ సుమారు 49 తోమాహాక్ క్షిపణులను ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా యూఎస్ సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది. యూఎస్ఎస్ మిచ్చెల్ మర్ఫీ యుద్ధ నౌక నుంచి తోమాహాక్ క్షిపణులను ఫైర్ చేశారు. ఈ ఆపరేషన్‌ను అధ్యక్షుడు ట్రంప్ కన్ఫర్మ్ చేశారు.
ఇరాన్‌లోని మిలిటరీ నిఘా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలను ఆ క్షిపణులతో అమెరికా అటాక్ చేసింది. యూఎస్ మెరైన్ కార్ప్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ .. సంయుక్తంగా ఇరానీ టార్గెట్లను పేల్చేసినట్లు సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో చెప్పింది. హోర్ముజ్‌లో అంతర్జాతీయ నౌకలకు ఇబ్బందికరంగా మారిన ఇరానీ క్షేత్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా పేర్కొన్నది. అమెరికా సేనలు నిత్యం అప్రమత్తంగా, ఆయుధ సామర్థ్యంతో ఉన్నాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది.
— U.S. Central Command (@CENTCOM) June 11, 2026