Rishi Sunak | భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో ముందు వరుసలో నిలిచారు. బ్రిటన్ పార్లమెంట్లో సీనియర్ కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, కామన్స్ లీడర్ మార్క్ స్పెన్సర్, పార్టీ మాజీ చైర్మన్ ఒలివర్ డౌడెన్, మాజీ మంత్రి లియామ్ ఫాక్స్ సహా పలువురు సీనియర్ టోరీ సభ్యులు రిషి సునాక్కు మద్దతు పలికారు.
రిషి సునాక్ కూడా #Ready4Rishi అనే పేరిట సోషల్ మీడియా ప్రచారోద్యమం చేపట్టారు. తనకు వేల మంది మద్దతుగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.
రిషి సునాక్ ఇంతకుముందు బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్.. భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు కావడం విశేషం.