లండన్ : టైటానిక్ షిప్ ప్రమాదం చరిత్రలో అత్యంత విషాదంగా మిగిలిపోయింది. ఇందుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన అంశాలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా టైటానిక్‌కు సంబంధించి మరో అంశం వార్తల్లో నిలిచింది.
టైటానిక్‌లో ప్రయాణించిన ఇసిడోర్ స్ట్రాస్ అనే వ్యక్తికి చెందిన 18 క్యారెట్ల జూల్స్ జుర్గెన్సెస్ గోల్డ్ పాకెట్ వాచ్ వేలం పాటలో రూ.18 కోట్లు పలికింది. ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వారు వేసిన వేలంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.