శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం, ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌ను టిక్‌టాక్ దాటేసింది. ‘మోస్ట్ పాపులర్ వెబ్సైట్ ఆఫ్ ది ఇయర్’గా టిక్‌టాక్ నిలిచింది. క్లౌడ్‌ఫ్లేర్ అనే ఐటీ సెక్యూరిటీ కంపెనీ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గూగుల్ కన్నా టిక్‌టాక్‌నే ఎక్కువ మంది వినియోగించారని తెలిపింది. 2020లో తొలిస్థానంలో గూగుల్ నిలువగా.. టిక్‌టాక్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్‌లు టాప్ 10 జాబితాలో ఉన్నాయి. చైనాతో సరిహద్దు ఘర్షణలు, భద్రతా కారణాల రీత్యా టిక్‌టాక్‌పై గతేడాది జూన్‌లో భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.