న్యూజెర్సీ, అక్టోబర్ 19: అమెరికాలోని న్యూజెర్సీ హొబోకెన్లో భారత సంతతి సిక్కు మేయర్ రవిభల్లాను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఆయన యూఎస్ మీడియాతో మాట్లాడుతూ తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ తరచూ కొందరు బెదిరిస్తున్నారని వాపోయారు. తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ ఏడాది నుంచి ఈబెదిరింపు లేఖలు వస్తున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని పట్టుకున్నారని, అసలు సూత్రధారి ఎవరో వెల్లడి కాలేదన్నారు.