King Charles Coronation | మరికాసేపట్లో బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం (King Charles Coronation) జరగనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బ్రిటన్ (Britain) రాజకుటుంబంపైనే ఉంది. ఈ వేడుకకు 100 మంది దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. మన దేశం నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు.
భారత ప్రభుత్వం తరపున ఉపరాష్ట్రపతి (Vice President) జగ్దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) ఈ పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతారు. భారత్ నుంచి రాష్ట్రపతి హాజరు కావాల్సి ఉండగా.. ఉపరాష్ట్రపతి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్‌తో కలిసి ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతితోపాటు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor)కు కూడా రాయల్ ఫ్యామిటీ నుంచి ఆహ్వానం అందింది. వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గాయక బృందం కార్యక్రమం ఉంటుంది. ఈ బృందానికి స్వాగతం పలుకుతూ సోనమ్ వారి గురించి మాట్లాడనున్నారు. సోనమ్ భర్త ఆనంద్ అహూజ బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారు.
ముంబైకి చెందిన ఇద్దరు డబ్బావాలాలు (Mumbai Dabbawalas) కూడా ఈ పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతారని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఈ సందర్భంగా వార్కారీ కమ్యూనిటీ తయారు చేసిన పునేరీ తలపాగా, శాలువాను రాజుకు బహూకరించనన్నారు. ముంబైలో లంచ్ బాక్సులు అందిస్తూ డబ్బావాలాలు ఎంతో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003లో భారత్‌లో పర్యటించిన చార్లెస్.. ముంబై డబ్బావాలాలను కలుసుకున్నారు. 2005లో చార్లెస్- కెమిల్లా వివాహానికి కూడా ఈ డబ్బావాలాలకు ఆహ్వానం అందింది.
వీరితోపాటు భారత సంతతికి చెందిన పలువురు పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతారు. చార్లెస్ ఫౌండేషన్ బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్, ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పుణెకు చెందిన 37 ఏళ్ల ఆర్కిటెక్ట్ సౌరభ్ ఫడ్కే (Sourabh Phadke)ను ఈ వేడుకకు ఆహ్వానించారు. గతేడాది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డు అందుకున్న ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల గల్ఫ్షా (Gulfsha) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇండో కెనడియన్ జై పటేల్ (Jay Patel) కూడా పట్టాభిషేక కార్యక్రమానికి హాజరుకానున్నారు.
భారత్‌కు చెందదిన షెఫ్ మంజూ మల్హీ (Manju Malhi) కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. బ్రిటన్‌లో జన్మించిన ఆమె.. యూకేలోని ఓ వయోవృద్ధుల స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఆమె చేసిన సేవలకు గానూ బ్రిటిష్ రాజకుటుంబ మెడల్‌ను అందుకున్నారు. రాజు పట్టాభిషేక కార్యక్రమంలో భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి (Britain Prime Minister) రిషి సునాక్ (Rishi Sunak), ఆయన భార్య అక్షతా మూర్తి (Akshata Murty ) కూడా పాల్గొంటారు.
Also Read..
King Charles Coronation | రాజు పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై రాజకుటుంబం కీలక ప్రకటన
King Charles Coronation: పట్టాభిషేకంలో కింగ్ చార్లెస్ ధరించే కిరీటాలు ఇవే..
Coronation Chair: ఈ కుర్చీలోనే చార్లెస్‌కు పట్టాభిషేకం..