e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News కెనడాలో విచిత్ర ప‌రిస్థితి.. దేశం పెద్ద‌దే అయినా స్థ‌లాలకు క‌రువొచ్చింది..!

కెనడాలో విచిత్ర ప‌రిస్థితి.. దేశం పెద్ద‌దే అయినా స్థ‌లాలకు క‌రువొచ్చింది..!

కెనడాలో విచిత్ర ప‌రిస్థితి.. దేశం పెద్ద‌దే అయినా స్థ‌లాలకు క‌రువొచ్చింది..!

టొరంటో: ప్ర‌పంచంలో విస్తీర్ణం ప‌రంగా ర‌ష్యా త‌ర్వాత రెండో అతిపెద్ద దేశంగా ఉన్న కెనడాలో ఇప్పుడు ఇండ్ల స్థలాల‌కు క‌రువు ఏర్ప‌డింది. ప్ర‌పంచంలో మ‌రే దేశంలో లేనంత‌గా కెనడా హౌసింగ్ మార్కెట్ హాట్‌హాట్‌గా న‌డుస్తున్న‌ది. అక్క‌డ‌ కొనుగోలు దారుల నుంచి భూముల‌కు ఉన్న డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న భూముల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం అంత‌కంత‌కే పెరిగిపోతున్న‌ది.

కెనడాలో ఇండ్ల కొనుగోలుదారులు పెద్ద‌పెద్ద ఇండ్లు కావాల‌ని కోరుకుంటున్నారు. కానీ ప్ర‌జ‌ల‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండే ప్ర‌ధాన న‌గ‌రాల్లో స‌రిప‌డా ఖాళీ స్థ‌లాలు లేక పెద్ద‌పెద్ద స్థలాలు దొరికే ప‌రిస్థితి లేకుండా పోయింది. యూర‌ప్ లేదా జ‌పాన్ లేదా ప్ర‌పంచంలోని ఇత‌ర ప్ర‌దేశాల‌తో పోల్చి చూస్తే.. కెన‌డాలో స్థ‌లాల‌కు కొర‌త అనేది తాజా దృగ్విష‌యం అని రాయ‌ల్ బ్యాంక్ ఆఫ్ కెన‌డాకు చెందిన ఆర్థిక‌వేత్త రాబ‌ర్ట్ హాగ్ చెప్పారు.

పెద్ద ఇండ్ల‌కు మొగ్గు

ప‌రిస్థితి చూస్తుంటే కెన‌డాలో భవిష్యత్ తరాల్లో సొంతింటిదారుల సంఖ్య ప్ర‌స్తుతం యూర‌ప్‌లో సొంతింటి దారుల సంఖ్య‌ను మించిపోయేలా ఉన్న‌ద‌ని రాబ‌ర్ట్ హాగ్ పేర్కొన్నారు. కెన‌డాలో చాలాకాలంగా ఇల్లు కొన‌డం అనేది ఒక భ‌ద్ర‌మైన పెట్టుబ‌డిగా కొన‌సాగుతున్న‌ది. పెద్ద‌పెద్ద ఇండ్ల‌లో నివ‌సించే వారి స‌గ‌టు మిగ‌తా దేశాల‌తో పోల్చితే కెనడాలోనే అధికంగా ఉన్న‌ది. అంతేగాక సొంతింటి కోసం పెడుతున్న ధ‌ర‌లు కూడా బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశాల కంటే కెన‌డాలోనే ఎక్కువ‌గా ఉన్నాయి.

గ‌త ఏడాది కెన‌డా రాజ‌ధాని టొరంటోతోపాటు మాంట్రియాల్‌, వాంకోవ‌ర్‌, ఒట్టావా త‌దిత‌ర న‌గ‌రాల ప‌రిధిలోని 18 క‌మ్యూనిటీల్లో జ‌రిగిన ఇండ్ల అమ్మ‌కాల్లో 60 శాతం వ్య‌క్తిగ‌త గృహాలే ఉన్నాయి. కేవ‌లం 25 శాతం స్థలాలు మాత్ర‌మే అపార్టుమెంట్ల నిర్మాణం కోసం అమ్ముడు పోయాయి. స్థానిక రియల్ ఎస్టేట్ బోర్డుల నుంచి సేక‌రించిన స‌మాచారం మేరుకు బ్లూమ్‌బ‌ర్గ్ న్యూస్ సంస్థ‌ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

అయితే అదే న‌గ‌రాల్లో గ‌త ద‌శాబ్దకాలంగా జ‌రిగిన ఇండ్ల అమ్మ‌కాల‌ను ప‌రిశీలిస్తే అపార్టుమెంట్లు, వ్య‌క్తిగ‌త గృహాల కొనుగోలు శాతాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కెన‌డా ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్న‌ట్లు బ్లూమ్బ‌ర్గ్ తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కెనడాలో విచిత్ర ప‌రిస్థితి.. దేశం పెద్ద‌దే అయినా స్థ‌లాలకు క‌రువొచ్చింది..!

ట్రెండింగ్‌

Advertisement