మాస్కో: రష్యన్ న్యూరోటెక్ కంపెనీ నెయిరో పావురాలను బయో-డ్రోన్లుగా మార్చింది. పావురం మెదడులో చిప్‌ను అమర్చినపుడు అవి మానవుల ఆదేశాల మేరకు పని చేస్తున్నాయి. ఇటీవల మాస్కోలో ఈ బయో-డ్రోన్ల ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమయ్యాయి.
ఇవి రిమోట్ కంట్రోల్ ద్వారా ఇచ్చిన కమాండ్లను పాటించాయి. దీని కోసం పావురానికి ఎటువంటి ముందస్తు శిక్షణ అవసరం ఉండదు. పవర్ గ్రిడ్స్, గ్యాస్ పైప్‌లైన్స్, ఫ్యాక్టరీలు, మారుమూల ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఈ పావురాలను ఉపయోగిస్తారు.