Hong Kong | హాంకాంగ్: హాంకాంగ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. 140 ఏండ్లలో ఏన్నడూ చూడని భారీ వర్షపాతం నమోదవడంతో వరదలు సంభవించాయి. దీంతో హాంకాంగ్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణ చైనాను అతలాకుతలం చేసిన హైకు తుఫాను శుక్రవారం హాంకాంగ్‌ను తాకడంతో భారీ వర్షం కురిసింది.
షాపింగ్‌మాల్స్, మెట్రో స్టేషన్లు, అనేక ఇండ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలించారు. వరద నష్టంతో పాటు వ్యాపార సముదాయాలు మూతపడటంతో సుమారు 100 మిలియన్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.