న్యూయార్క్: అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతున్నదని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది. ఈ రంగంలో భారత్ గణనీయమైన వృద్ధి దిశగా సాగుతున్నదని, స్టార్టప్‌లు విస్తరిస్తున్నాయని పేర్కొన్నది.
త్వరలో చైనాకు ధీటుగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని కొనియాడింది. అంతరిక్ష రంగంలో గత 60 ఏండ్లలో భారతదేశం సాధించిన పురోగతిని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ప్రస్తావించింది.