టొరొంటో, సెప్టెంబర్ 10: కెనడా స్టడీ వీసా ఆమోదం పొందటంలో భారతీయ విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి. దీంతో ఈ ఏడాది స్టడీ వీసాలను పొందే భారతీయ విద్యార్థుల సంఖ్య 50 శాతం వరకు తగ్గవచ్చునని కెనడా ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ‘ఆపిల్బోర్డ్’ తాజా నివేదిక అంచనా వేసింది.
స్టడీ పర్మిట్ కోసం వచ్చిన గ్లోబల్ అప్లికేషన్ల సంఖ్యలో 39 శాతం తగ్గుదల ఉంటుందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, గత ఏడాది 4,36,000 స్టడీ వీసాలు జారీచేయగా, ఈ ఏడాది వీటి సంఖ్య కేవలం 2,31,000కు పరిమితయ్యే అవకాశముంది.