ఒక ఆవు ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. అయితే అది అక్కడికి ఎలా చేరిందో అన్నది అర్ధం కాలేదు. ఈ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సాధారంగా మేకలు, కుక్కలు, పిల్లులు వంటి జంతువులు కొన్ని సందర్భాల్లో చెట్లు, కొండ గుట్టలు ఎక్కుతుంటాయి. అలాగే కిందకు దిగేందుకు అవి ఇబ్బంది పడటం కూడా మనం చూస్తుంటాం. అయితే ఒక ఆవు ఏకంగా ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. అయితే అది అక్కడికి ఎలా చేరిందో అన్నది అర్ధం కాలేదు. ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
మరోవైపు ఆవు ఇంటి పైకి ఎక్కిన ఈ వీడియో క్లిప్‌ను చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. అది అక్కడకు ఎలా ఎక్కింది? అంటూ పలువురు ప్రశ్నించారు. ఆ తర్వాత ఏమైంది? ఆ ఆవు కిందకు దిగిందా? ఎలా దిగింది? ఎవరైనా ఆ ఆవును కిందకు దింపారా? అన్న సందేహాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేశారు. అయితే జంతువుల పట్ల వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు సూచించారు. లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, అవి ప్రమాదాల బారిన పడతాయని పేర్కొన్నారు.
So many questions.. 😅 pic.twitter.com/dPDozPfMC2
— Buitengebieden (@buitengebieden) February 12, 2023