లండన్: కొవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్‌తో గుండెకు ముప్పు అని ఇండో బ్రిటన్ వైద్యురాలు, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ అమీన్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే కొవిషీల్డ్‌తో గుండె సంబంధిత దుష్ప్రభావాలు ఉన్నాయని, ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువని వివరించారు. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తున్నదని పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్‌కు ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఇచ్చి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఫైజర్ కంపెనీ తీసుకొచ్చిన ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కూడా ప్రమాదం అని తెలిపారు.