వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న భారతీయులు సహా పలువురు విదేశీ ఉద్యోగులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. అమెరికాలో వృత్తి నిపుణులుగా వివిధ హోదాలలో పనిచేస్తున్న వేలాదిమంది ఇక నుంచి తమ వర్క్ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు పరుగెత్తనక్కర లేదు. అమెరికాలోనే వారు తమ వర్క్ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చునని ఆ దేశం ప్రకటించింది. దీని కోసం పైలట్ ప్రోగ్రామ్ను త్వరలోనే చేపట్టనుంది.
అమెరికాలో హెచ్-1బి వీసాదారులలో అధికులు భారతీయులే. 2002 ఆర్థిక సంవత్సరంలో వీసా వినియోగదారులు 4,42,000 మందిలో 73 శాతం భారతీయులే. తాత్కాలిక వీసాలపై పనిచేస్తున్న విదేశీయులు తమ ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటేనే హెచ్-1బి వీసాలను పునరుద్ధరించుకునే విధానం ప్రవేశపెట్టడానికి అగ్రరాజ్యం సిద్ధమైంది.