న్యూయార్క్, జూలై 23: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘పిట్ట’ మాయం కానుంది! ట్విట్టర్ పిట్ట స్థానంలో కొత్త లోగోను తీసుకొస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు.
‘ట్విట్టర్ బ్రాండ్‌కు వీడ్కోలు పలుకుతున్నాం. దాంతో పాటు అన్ని పక్షులకు కూడా వీడ్కోలు చెబుతున్నాం. ఆదివారం రాత్రి లోపు కొత్త లోగోను ప్రకటిస్తాం. సోమవారం నుంచి దాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తాం’ అని మస్క్ ట్వీట్ చేశారు.