Pezeshkian | ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్
Pezeshkian | ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి నుంచి భారత ప్రధానికి ఫోన్ వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది.
Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి నుంచి భారత ప్రధానికి ఫోన్ వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. ఇరాన్లో పరిస్థితి గురించి ఈ సందర్భంగా ప్రధానికి పెజెష్కియాన్ వివరించారు.
భారత్‌ను తనకు మంచి మిత్రుడుగా, శాంతిని పెంపొందించే భాగస్వామిగా అభివర్ణించారు. చర్చలు, దౌత్య మార్గం ద్వారా ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలు శాంతిని నెలకొల్పుకోవాలని సూచన చేసినందుకు ప్రధాని మోదీకి పెజెష్కియాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొనడంలో భారత గళం, పాత్ర చాలా కీలకమని పెజెష్కియాన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
కాగా ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ తరఫున అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అయితే అమెరికా తమపై ప్రత్యక్ష దాడికి దిగడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై దాడులు చేస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
Read More >>
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. రియాద్‌కు దారి మళ్లింపు
ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్.. అమెరికాలోని పలుచోట్ల హై అలర్ట్
‘పహల్గాం’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు అరెస్ట్
అమెరికా మొదలు పెట్టింది.. మేం అంతం చేస్తాం : ఇరాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

