టెహ్రాన్: ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ముఖానికి, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఖమేనీ సన్నిహితులు ఈ విషయాలను వెల్లడించినట్టు సమాచారం. రాయిటర్స్ నివేదిక ప్రకారం మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డా మానసికంగా చురుగ్గా ఉన్నారు. ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిపాలన విధులు నిర్వహిస్తున్నారు.
యుద్ధం, శాంతి చర్చలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం మొజ్తబా ఒక గళంగా ఉంటారు. ఆయన తనను తాను సర్వోన్నతమైన పాలకుడిగా నిరూపించుకోవాల్సి ఉంది.