ఆదివారం 07 మార్చి 2021
International - Jan 16, 2021 , 02:14:23

ఉగ్రవాదుల ‘ముందుచూపు’!

ఉగ్రవాదుల ‘ముందుచూపు’!

సమాచార మార్పిడికి పటిష్ఠమైన త్రీమా యాప్‌

వాట్సాప్‌, సిగ్నల్‌, టెలిగ్రామ్‌ కన్నా ఎక్కువ సెక్యూరిటీ: ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ, జనవరి 15: ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌లు, సమాచార భద్రత విషయంలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాదులు మనకన్నా ఒకడుగు ముందే ఉన్నారు. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటనతో టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ల వాడకం పెరిగింది. అయితే ఇంతకంటే ముందే ఉగ్రవాదులు సమాచార భద్రతపరంగా అత్యంత పటిష్ఠమైన ‘త్రీమా’ యాప్‌ను వాడుతున్నట్టు నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. త్రీమా యాప్‌ ద్వారానే దేశవిదేశాల్లోని ఉగ్రవాదులు ఒకరికొకరు సమాచారం పంపిస్తున్నట్టు పేర్కొన్నది. ఐసిస్‌ ఉగ్రవాదులు జహాన్‌జైబ్‌ వనీ, అతని భార్య హీనా బేగ్‌, బెంగళూరుకు చెందిన అబ్దుర్‌ రెహమాన్‌లను ప్రశ్నిస్తున్న సమయంలో ఈ విషయం తెలిసిందని ఎన్‌ఐఏ పేర్కొన్నది. వనీ, బేగ్‌ గతేడాది మార్చిలో అరెస్టు అయ్యారు. రెహమాన్‌ను ఆగస్టులో అదుపులోకి తీసుకొన్నారు. ఈ ముగ్గురు త్రీమా యాప్‌ ద్వారానే టచ్‌లో ఉండేవారని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. త్రీమా నుంచి పంపిన మెసేజ్‌లను, కాల్స్‌ను ట్రాక్‌ చేయడం కష్టం. ఇందులో ఉండే సమాచారం సర్వర్‌కు బదులుగా ఫోన్లోనే సేవ్‌ అవుతుంది. ఈ యాప్‌ను స్విట్జర్లాండ్‌లో అభివృద్ధి చేసినట్టు అధికారులు చెప్పారు. 

VIDEOS

logo