సియోల్, నవంబర్ 2: ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో బుధవారం క్షిపణుల మోత మోగింది. ముందు ఉత్తర కొరియా సముద్రపు సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన ఓ దీవి వైపు 20కి పైగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో దీవిలోని వారందరూ భూగర్భంలో నిర్మించుకున్న బంకర్లలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే స్పందించిన దక్షిణ కొరియా అదే ప్రాంతంలో సముద్రంపైకి క్షిపణులను పంపించింది. అమెరికా సైన్యంతో కలిసి దక్షిణ కొరియా చేపట్టిన సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తున్నది. ‘చరిత్రలో ఎన్నడూ ఎరుగనంత భయంకరమైన మూల్యాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే క్షిపణులతో దాడులకు తెగబడింది.